మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి పిల్లలను కాపాడుకోవాలి

Share

తేదీ: 19-03-2025

మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి పిల్లలను కాపాడుకోవాలి

స్థలం: హాయత్నగర్ బస్ స్టాప్ & పెద్ద అంబర్‌పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల

 

మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి పిల్లలను కాపాడుకోవాలని HRC రైట్ టు ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. మాదకద్రవ్యాల నిర్ములన కోసం HRC రైట్ టు ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హాయత్నగర్ బస్ స్టాప్, పెద్ద అంబర్‌పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో బుధవారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల పిల్లల బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాల వాడకం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, కుటుంబ, సామాజిక సంబంధాలు దెబ్బతింటాయని అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందుబాటులో ఉన్న సహాయ సేవలు, పునరావాస కేంద్రాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులు, పోలీస్ అధికారులు, వైద్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top