మాధకద్రవ్యాల నిర్ములనలో ప్రతి ఒకరు భాగస్వాములు కావాలి

Share

ఘట్‌కేసర్, మార్చి 18: మాధకద్రవ్యాల నిర్ములనలో ప్రతి ఒకరు భాగస్వాములు కావాలని HRC రైట్ టు ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘట్‌కేసర్ బస్టాండ్, ప్రజా సముదాయ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ అధికారులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు పాల్గొని మాదకద్రవ్యాల ప్రభావంపై అవగాహన కలిగి, వాటి వ్యసన బారినపడకుండా ఉండే మార్గాలపై చర్చించారు.

 

ఈ సందర్భంగా HRC రైట్ టు ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ, “దేశానికి వెన్నుముక లాంటి యువత మాదకద్రవ్యాల మత్తులో జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఇది దేశ ప్రగతికి ముప్పుగా మారే అవకాశం ఉందని వెంటనే ఈ మహమారిని నాశనం చేయాలని తెలిపారు”

 

ఈ కార్యక్రమంలో హెచ్ఆర్సీ రైట్ టు ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ప్రతినిధులు చెన్నోజు నరసింహ చారి, చెన్నోజు సాయినాథ్, చెన్నోజు మల్లికార్జున్, పులిగిల్ల సాయి మరియు సమాచార హక్కు మనోహక్కుల లాసమితి వ్యవస్థాప అధ్యక్షులు కన్నె కంటి క్రాంతి కుమార్, ట్రాఫిక్ పోలీసు, ఆర్టీసీ సిబ్బంది, విద్యార్థులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top