విశ్వకర్మ ఆలయ ప్రారంభోత్సవం రెండవ రోజు

Share

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో విశ్వకర్మ పంచ కులాలు నూతనంగా ఏర్పాటు చేస్తున్న శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు రెండవ రోజు ఈ సందర్భంగా గుడి నిర్మాణ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ చారి మాట్లాడుతూ భారతజాతికి కాలజ్ఞానని అందించిన వీరబ్రహ్మేంద్రస్వామి గుడి నిర్మాణం చౌటుప్పల్ పట్టణంలో ఏర్పాటు చేయడంలో విశ్వకర్మల కృషి ఎంతో ఉందని ప్రతి ఒక్కరు సహకరించి, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయిస్తున్నారని, సహకరించిన ప్రతి ఒక్కరిని పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుడి కమిటీ ప్రధాన కార్యదర్శి పంతంగి నాగవాచారి, కోశాధికారి దేవరకొండ నరసింహ చారి, మనుమయ సంఘం పాలకవర్గం, విశ్వకర్మ స్వర్ణకార సంఘం, కుల పెద్దలు, అఖిలపక్ష నాయకులు, మరియు సంఘం సభ్యులు పాల్గొనడం జరిగింది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top