“యువత భవిష్యత్తును రక్షిద్దాం – మాదకద్రవ్యాలకు నో చెప్పుదాం!”

Share

చౌటుప్పల్, ఎన్ 1 న్యూస్ :

భారత దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని, మాదక ద్రవ్యాలకు బానిసలై దేశంతో పాటు తమ భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని హెచ్ఆర్సీ రైట్ టు ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఎన్జీవో సంస్థ చైర్మన్ బొల్లోజు శ్యాం కుమార్ సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకై ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలల్లో భాగంగా సోమవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం మాతృశ్రీ డిగ్రీ కళాశాల విద్యార్థులతో సమావేశమై మాదకద్రవ్యల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎన్జీవో చైర్మన్ బొల్లోజు శ్యాం కుమార్ మాట్లాడుతూ దేశం శక్తివంతంగా మారాలంటే యువత శారీరకంగా, మానసికంగా పూర్తి ఆరోగ్యంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాలను సేవించడం ద్వారా బుద్ధి మందగిస్తుందని, నరాల బలహీనత కలుగుతుందని, ముఖ్యంగా నేర ప్రవృత్తికి ప్రోత్సహిస్తుందన్నారు. ఎంతో మంది యువత చెడు వ్యసనాలకు బానిసలై, బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో తల్లిదండ్రులు, పాఠశాల, కళాశాల్లో ఉపాధ్యాయులు యువత చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా చూడాలని కోరారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ట్రస్టు ద్వారా నిరంతర కృషి చేస్తున్నామన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశలో మంచి, చెడులను పూర్తి అవగాహనతో తెలుసుకోవాలన్నారు. మంచి మార్గంలో వెళ్తేనే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఆర్ సి రైట్ టు ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఎన్జీవో సంస్థ ప్రతినిధులు చెన్నోజు మల్లికార్జున్, చెన్నోజు శశాంక్, కేతరాజు మహేష్, సమాచార హక్కు మానవ హక్కుల సమితి అధ్యక్షుడు కన్నెకంటి క్రాంతి కుమార్, అన్నపూర్ణ అన్నదాన ట్రస్ట్ అధ్యక్షుడు వెంకటేష్, సమాచార హక్కు రక్షణ చట్టం జిల్లా అధ్యక్షుడు శేఖర్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top